అన్ని పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనీఖీ చేయాలని

ఆర్టీఏ అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించి క్షుణ్ణంగా తనీఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రవాణాశాఖ అదికారులను ఆదేశించారు. ఏ చిన్న ప్రమాదం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లకు లైసెన్స్‌లు తప్పనిసరిగా ఉండేలా సరైన చర్యలు తీసుకోవాలని  తెలిపారు.