అన్ని రాజకీయ కార్యక్రమాలకూ దూరం

– బీజేపీఅధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పుల్వామా ఆత్మాహుతి దాడిని దృష్టిలో ఉంచుకుని ముందుగా ప్లాన్‌ చేసిన రాజకీయ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసింది. ఉగ్రవాదులు 44 మంది జవాన్లను పొట్టున పెట్టుకున్న ఈ విషాద సమయంలో దేశమంతా ఏకతాటిపై నిలవాలని, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొద్దిసేపటికే బీజేపీ తాజా నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ, మధ్యప్రదేశ్‌లో మోదీ జరపాల్సిన బహిరంగ సభతో పాటు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహించాల్సిన ర్యాలీలు రద్దయినట్టు చెప్పారు. ‘దేశాభివృద్ధి కోసం చేపట్టిన పనులు కొనసాగుతాయన్నారు. ఉగ్రదాడి కారణంగా ఏ అభివృద్ధి పనులు ఆగవు. అభివృద్ధిని అ?డడుకోవడమే టెర్రరిస్టుల అజెండా. అయితే వారి ఎత్తులు సాగనీయం’ అని సంబిత్‌ పాత్ర అన్నారు. కాగా, జవాన్లపై ఉగ్రదాడిని ఖండించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం… ఈ రెండు మూడు రోజులు రాజకీయ చర్చలకు పార్టీ పరంగా దూరంగా ఉంటామని ప్రకటించారు. గురువారం సైతం జి-20 దేశాల రాయబారులతో విందు సమావేశాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాసైతం తన తొలి విూడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. రాజకీయాల గురించి మాట్లాడే సమయం ఇది కాదని, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణానికి అంతా నివాళులర్పించాలని ఆమె అన్నారు.