అన్నీ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం కిరణ్‌కుమారఎడ్డి ఆదేశించారు. వరద సహాయకచర్యలకు అధికారయంత్రాంగాన్ని సిద్ధంచేయాలని ఆయన కోరారు. రాజధాని నగరంలో పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆయన చర్చించారు. పారిశుద్ధ్య, వైద్య సహాయక బృందాలను సిద్దంగా వుంచి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.