అఫ్గానిస్థాన్‌లో దాదుల్లా మృతి

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్న నాటో దాడిలో తమ ఉన్నతస్థాయి కమాండర్‌ ముల్లా దాదుల్లా, అతని అనుచరులు మరో 18 మంది మరణించారని పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో అమెరికా మానవ రహిత విమానాలు జరిపిన దాడిలో దాదుల్లా సహా 19 మంది ఉగ్రవాదులు మరణించారని అఫ్గానిస్థాన్‌ అధికారులు, తాలిబన్‌ కమాండర్లు ప్రకటించారు. ఈ దాడిలో మరో ఎనిమిది మంది పాకిస్థాన్‌ ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారని వారిని అఫ్గాన్‌లోని అసాదాబాద్‌ ఆసుత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.