అభిజిత్‌ గుప్తాకు గ్రీస్‌ చెస్‌ టైటిల్‌

కావలా(గీన్‌): భారత గ్రాండ్‌ మాస్టర్‌, జాతీయ చాంపియన్‌ అభిజిత్‌ గుప్తా 6కావలా అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ గెల్చుకున్నాడు. జార్జియా ఆటగాడు షోటా ఆడాలాడ్జీతో జరిగిన చివరి గేమ్‌ ను అభిజిత్‌ డ్రా చేసుకున్నాడు. 7.5 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి టైటిల్‌ సాధించాడు.