అభివృద్థి రుసుం వసూలు చేయనున్న ఆర్జీసీ

హైదరాబాద్‌: ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం పేరిట అదనపు వసూలకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ఈమేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి రుసుం వసూలు చేయాలని నిర్ణయించినట్లు బొత్స స్పష్టం చేశారు. ఆర్డినరీ బస్సులో ప్రతి టికెట్‌పై 50పైసలు, ఎక్స్‌ప్రెస్‌లో రూపాయి చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. రోజుకు 70 లక్షల చొప్పున రూ. 250 కోట్లు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.