`అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యం బంగారు  తెలంగాణ సాకారం కావాలి

 

 

బిజెపి నేతల విమర్శలతో ఒరిగేదేవిూ లేదు

ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనమని, గత తెలంగాణకు నేటి తెలంగాణకు అభివృద్దిలో స్పష్టమైన తేడాను గమనించాలని ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌  అన్నారు. బిజెపి రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ది చేయదని అన్నారు.  ప్రతిపనిపై దూరదృష్టితో ఆలోచించి నియోజక వర్గంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. 60 ఏండ్లలో టీడీపీ, కాంగ్రెస్‌ చేయలేని పనులను కెసిఆర్‌ ఏడేండ్లలో చేసి చూపారని గుర్తు చేశారు. సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందిని పేర్కొన్నారు. 60ఏళ్ల ఉమ్మడి పాలనకి, టీఆర్‌ఎస్‌ పాలనలో ఉన్న వ్యత్యాసం ఏమిటో ప్రజలకు చూపించామని తెలియజెప్పారు.  తనను గ్రామగ్రామాన ప్రజలు అత్యంత ప్రేమగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్‌ కష్టపడుతున్నారు కనుకనే టీఆర్‌ఎస్‌ పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఘంటాపథంగా చెప్పగులుగుతున్నామని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ అన్ని కులాల అభివృద్ధికి పలు పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని ఆర్థికంగా ఎదుగేందకు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అన్ని కులాల వారి కులకృత్తులను ప్రోత్సహిస్తు న్నారనీ, అన్ని కులాల వారు ఆర్థికంగా ఎదిగేనప్పుడే పోరాడి సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక  నియోజవర్గంలో అర్హులైన ప్రతి పేదవారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని హావిూ ఇచ్చారు. గత పాలకులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించకుండానే బిల్లులు తీసుక్నునారని అన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు చూసి వాటిలో భాగస్వామ్యం కావాలనే అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.  అల్లాటప్పాగా వచ్చి చేరడం లేదన్నారు. జనం మెచ్చిన పాలన చూసి వివిధ పార్టీలు, కుల సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిచింద న్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో వారికి లబ్ధి చేకూరిందని బాజిరెడ్డి వివరించారు. ప్రజామోదం పొందిన కేసీఆర్‌ పాలనను చూసి నియోజకవర్గంలో అనేక మంది కుల సంఘాల, వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడం శుభ సూచకమన్నారు. వారంతా ఇంటి పార్టీ అని భావించి చేరుతున్నారని వివరించారు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి కేసీఆర్‌ అన్ని వర్గాలను ఆర్థికపథంలో నడిపించాలన్న ఉద్ధేశంతో సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ అమలు చేస్తున్నా రన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పక్క రాష్టాల్రు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరిగి సంక్షేమ ఫలాలు దక్కాలంటే టిఆర్‌ఎస్‌ పాలన కొనసాగలన్నారు.

700 రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమంప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న యాత్రఅడుగడుగునా పాదయాత్రకు ప్రజల మద్దతువిపక్షాల మద్దతుతో కొనసాగుతున్న యాత్రఒంగోలు,నవంబర్‌16(జనం సాక్షి ): రాజధాని పరిరక్షణెళి ధ్యేయంగా రైతులు తలపెట్టిన మహాపాదయాత్ర నిరంతరంగా సాగుతోంది. ఉద్యమ స్ఫూర్తితో ఇది సాగుతోంది. ఎన్ని అవాంతరాలుఎదురైనా వారు ముందుకు సాగుతూనే ఉన్నారు. నిబంధనలు అతిక్రమించారంటూ పాదయాత్ర నిర్వాహకులను అడగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. మధ్యలో వర్షం అడ్డుకుంటోంది. అయినా వారు ఎక్కడా తొణక్కుండా ముందుకు సాగుతున్నారు. అమరావతిని ముక్కలు చేసి మూడు రాజధానుల కుట్ర మొదలై మంగళవారం నాటికి 700 రోజులు పూర్తవుతున్న సందర్భంగా పాదయాత్రలో ప్రత్యేక కార్యక్రమాలకు రూపొందిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు శివారెడ్డి, తిరుపతిరావు తెలిపారు. అమరావతిని ముక్కలు చేస్తూ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి మంగళవారానికి 700 రోజులు పూర్తి చేసుకుందని వారు తెలిపారు. ఈ రాష్టాన్రికి రాజధాని లేకుండా చేయడమే గాక అమరావతి రైతులను వీధిన పడేసిన జగన్మోహన్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజా ఉప్పెనలో ఆయన కొట్టుకుపోవడం ఖాయమని జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ’తమకు న్యాయం చేయండి మహాప్రభో’ అని దీక్షలకు పూనుకుంటే తమతో కనీసం సంప్రదించకుండా ప్రభుత్వమే పోటీ దీక్షలు పెట్టించడం దుర్మాగపు చర్య అన్నారు.  ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్టాన్రికి అమరావతి  ఏకైక రాజధానిగా ఉండి తీరుతుందన్నారు.మంగళవారం ఉదయం 9 గంటలకు కందుకూరు మండలంలోని విక్కిరాలపేటలో  పాదయాత్ర పునఃప్రారంభమయ్యింది. ప్రకాశం జిల్లాలో యాత్ర కొనసాగుతుండగానే పాదయాత్ర నిబంధనలను అతిక్రమించారంటూ.. నోటీసులు ఇచ్చారు. దీంతో  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిబంధనలు అతిక్రమించలేదని, నోటీసులు ఎందుకు ఇస్తున్నారో చెబితే అప్పుడు స్వీకరిస్తామన్నారు. ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందన్నారు. పాదయాత్రకు వస్తున్న మద్దతుతో ప్రభుత్వం భయపడుతోంది. మమ్మల్ని భయపెట్టాలని చూస్తోంది. పోలీసులు మాకు నోటీసులు ఇవ్వటమే అందుకు నిదర్శనం. అయితే, అణచివేత చర్యలకు మేం భయపడమని అన్నారు.  మహాపాదయాత్ర తిరుమల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహాపాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన.. వైసీపీ ప్రభుత్వంలో ఒణుకు పుట్టిస్తోందని పలువురు రైతులు పేర్కొన్నారు.  సంఫీుభావం తెలిపేందుకు వస్తున్న జనం కారణంగా రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తామే స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రైతులు చెప్పారు. సొంత సెక్యూరిటీతో రోప్‌ పార్టీ ద్వారా రోడ్డుకు ఒక వైపునే నడిచేలా క్రమశిక్షణ పాటిస్తూ పాదయాత్ర సాగిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టిన పాదయాత్రకు గుంటూరు జిల్లాలో కంటే రెట్టింపు స్పందన రావటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.