అమరావతిలో ఆనందోత్సవాలు

గుంటూరు, మార్చి 23 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరానికి అమరావతి పేరును నిర్ణయించడంపై అమరావతి వాసులు ఆనందోత్సవాలు చేసుకున్నారు. అమరావతిలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.