అమర్‌నాథ్‌ పయనమైన తొమ్మిదో బృందం

శ్రీనగర్‌: పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌క్యాంప్‌ నుంచి 2,910మంది పురుషులు, 836మంది మహిళలు, 197మంది చిన్నారులు, 152మంది సాధువులు, 132వాహనాల్లో ప్రయాణమయ్యారు. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లినవారి సంఖ్‌య 27, 772కి చేరింది.
మరో ముగ్గురి మృతి
మరో ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనితా చౌరాసియా (35()బ్రారీమార్గ్‌లో, ఉత్తరాఖండ్‌కు చెందిన సాధురాం(34)పాంజతరుణి ప్రాంతాల్లో ఆదివారం గుండెపోటుతో మృతి చెందారని అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన మోహన్‌లాల్‌ అఈనే యాత్రికుడిపై ప్రమాదావశాత్తు రాయి పడటంతో మృతి చెందాడు. దీంతో ఈ సారి మృతల సంఖ్య 22కి చేరింది.