అమర్‌నాధ్‌కు ముగిసిన 39 రోజుల యాత్ర

శ్రీనగర్‌: పవిత్ర చామరం (చెర్రి ముబారక్‌) హిమాలయాల్లోని కైలాసనాధుని ఆలయానికి చేరటంతో 39 రోజుల పాటు కొనసాగిన అమర్‌నాథ్‌ యాత్ర ముగిసింది. దీంతో జూన్‌ 25న ప్రారంభమైన అమర్‌నాధ్‌ యాత్ర ముగిసినట్లయింది. ఈ ఏడాది మొత్తం 6.20లక్షల మంది భక్తులు అమర్‌నాధ్‌ ఆలయాన్ని దర్శించుకొన్నారు. అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు వంటి కారణాల వల్ల మార్గమధ్యంలో 130 మంది యాత్రికులు చనిపోయారు.