అమీర్‌ఖాన్‌కు దక్కిన మరో అరుదైన గౌరవం

న్యూయార్క్‌: బాలీవుడ్‌ విలక్షణ కథానాయకుడు అమీర్‌ఖాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్‌ మేగజీన్‌ తన అసియా ఎడిషన్‌కవరు పేజీపై అమీర్‌కు స్థానమిచ్చి గౌరవించింది. ఆయన ఫోటోతోపాటు ఖాన్స్‌ క్వెస్ట్‌ అనే శీర్షికతో ముఖచిత్ర పేజీ రూపుదిద్దుకుంది. అమీర్‌ చేపట్టిన సత్యమేవ జయతే బుల్లి తెర కార్యక్రమాన్ని టైమ్‌ ప్రస్తుతించింది.