అమెరికాలో వరుస కాల్పులు

అమెరికా: అమెరికాలో దారుణ మారణకాండ చోటు చేసుకుంది. న్యూజెర్సీలో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు దుర్మరణం చెందగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాల్పులు  జరిపిన వ్యక్తిని పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం.