అమెరికా కోర్టు తీర్పుని సవాలు చేస్తామంటున్న స్యామ్‌సంగ్‌

ఢిల్లీ: పేటెంట్‌ హక్కుల అతిక్రమణ కేసులో ఆపిల్‌ కంపెనీఇ అనుకూలంగా అమెరికా న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే సవాలు చేయడానికి స్యామ్‌సంగ్‌ సిద్థమవుతోంది, కోర్టు నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతామని, అది విఫలమైన పక్షంలో అప్పీల్‌ కోర్టుకు వెళ్తామని కొరియన్‌ కంపెనీ స్యామ్‌సంగ్‌ ఒక  ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులకు ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని, స్యామ్‌ సంగ్‌ ఉత్పత్తిని  ఎంచుకునేటప్పుడు వాళ్లకు ఏం కావాలో తెలిసే ఎంచుకుంటున్నారని సంస్థ పేర్కొంది.