అమోథీలో రాహుల్‌కు చేదు అనుభవం

అమేథీ: రాహుల్‌ గాంధీకి సొంత నియోజకవర్గం అమేథీలో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. రాహుల్‌ను కలిసేందుకు రెండు గ్రామాలకు చెందిన కొంత మంది ప్రజలు ఆయనున్న మున్షీగంజ్‌ అతిధిగృహానికి వచ్చారు. వారికి రాహుల్‌ను కలిసేందుకు అవకాశం లభించలేదు. దీంతో వారు రాహుల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత రాహుల్‌ను కలిసేందుకు అనుమతించారు.