అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌

z6nu0j6aహైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలతో మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేసీఆర్‌ వెంట నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డి.శ్రీనివాస్, కే.కేశవరావులు ఉన్నారు