అయిలాబాద్‌లో పిచ్చి కుక్కల దాడిలో వృద్దురాలి మృతి

కరీంనగర్‌: వీణవంక మండలంలోని కిష్ణంపేట, అయిలాబాద్‌ గ్రామాలలో శుక్రవారం తెల్లవారు జామున పిచ్చికుక్కలు దాడి చేసి కరిచాయి. ఈ దాడిలో అయిలాబాద్‌ గ్రామానికి చెందిన పురంశెట్టి వీరమ్మ (70) తీవ్రగాయాల పాలై మృతి చెందింది. కిష్ణంపేట గ్రామానికి చెందిన పదిమందికి గాయాలయ్యాయి ఈ దాడిలో 10 పశువులకు కూడా గాయాలయినావి.