అయ్యప్ప భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు అవసరమైన వసతి, సౌకర్యాల కల్పనపై కేరళ ప్రభుత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. శబరిమల, పరిసర జిల్లాల్లో ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటుచేస్తున్నారు. అవసరమైన దీపాలు మంచినీటి నల్లాలు నిర్మాణం వంటివి యాత్ర మొదలయ్యే సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.