అరెస్టులతో కవాతును అడ్డుకోలేరు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణవాదుల డిమాండ్లపై స్పష్టత  ఇవ్వని సీఎం కవాతును వాయిదా వేసుకోమని అడుగుతున్నారని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కొదండరాం అన్నారు. అరెస్టులతో తెలంగాణ కవాతును అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా తెలంగాణ మంత్రులు రాష్ట్ర సాధన కోసం బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. తెలంగాణ పై నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం చులకనగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోకపోతే అనాగరిక దిశగా వెళ్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.