అరెస్టులు ఆపకపోతే మెరుపు సమ్మె::టీఎన్‌జీవో

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రా సాధన ఉద్యమంలో పాల్గోంటున్న తెలంగాణ ఉద్యోగస్థులను సీమాంధ్ర ప్రభుత్వం వేదిస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతొందని టీఎస్‌జీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. అక్రమ అరెస్టును ఆపాక పోతే మెరపు సమ్మెకు దిగి సీమాంధ్ర ప్రభుత్వానికి తమ తడాక చూపిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌ మార్చ్‌ విజయంవతం కోసం టీఎస్‌జీవో భవన్‌ తెలంగాణ ఉద్యోగసంఘాలు సమావేశమయ్యాయి. సమావేశంలో శ్రీనివాస్‌గౌడు మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను, ఉద్యోగస్తులను, అన్ని వర్గాల ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో బంధిస్తున్నారని. ఎమర్జేన్సీని తలపిస్తున్నారని ఆయన ధ్వజమొత్తరు. తెలంగాణ మార్చ్‌లో పాల్గొనడం ఈ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డ హక్కు  అని ఆయన పేర్కొన్నారు.