‘అరెస్లులు కొనసాగితే ఆందోళనలు తప్పవు’ హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగితే ఆందోళనలు తప్పవు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా అరెస్టులు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. దీనికి హోంమంత్రి, ఇన్‌ఛార్జి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేశారు.