అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 23
ప్రభుత్వం నుండి మంజూరైన ఆసరా పెన్షన్ ఒంటరి మహిళల వికలాంగుల వితంతువుల వృద్ధుల పెన్షన్లు ఆపవేసే అధికారం జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు లేదని అల్వాల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిఎల్ యాదగిరి డిమాండ్ చేశారు. ఇంటి టాక్సీ కట్టలేదని మీ దరఖాస్తు ఫారం అందలేదని ఇలా అనేక నేపాలతో నిరుపేద కుటుంబాలను బాధ పెట్టడం సమాజసం కాదని 57 ఏళ్లు దాటిన వారికి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని అల్వాల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ లు వెంటనే చొరవ తీసుకొని పెన్షన్ దారులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. గత రెండు నెలల క్రితం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేయాలని జిహెచ్ఎంసి కార్యాలయం ముందు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నా ర్యాలీ నిర్వహించి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా వృద్ధులకు వితంతువులకు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు కాలేదని వెంటనే పెన్షన్లనుమంజూరు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డిమాండ్ చేశారు.