అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

గుంటూరు, మే 27 (జనంసాక్షి):
జగన్‌ను అరెస్టు చేస్తే ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఆయన అర్బన్‌ ఎస్పీ రవికృష్ణ, డీఎస్పీలతో జగన్‌ అరెస్టుపై వస్తున్న వార్తలు, పత్తిపాడు ఉప ఎన్నికల నేపథ్యం లో ఆదివారం సమీక్షించారు. జగన్‌ అరెస్టు ముసుగులో అల్లర్లకు పాల్పడే అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అల్లర్లకు పాల్ప డే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. గతంలో రిలయన్స్‌ సంస్థలపై దాడుల్లో పాల్గొన్న నిందితులపై నిఘా కొనసాగిం చాలన్నా రు. మీడియా కార్యాలయాలు, రాజకీయ నాయకు ల కార్యాలయాల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించాలని ఆయన సూచించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గంలోని జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముంద స్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు అదనపు బలగాలు వచ్చిన నేపథ్యంలో ప్రధాన కూడళ్లతో పాటు గొడవలకు అవకాశం ఉండే ప్రాంతంపై దృష్టి సారించి బలగాలను మోహరించాలన్నారు. ప్రత్తిపాడు ఉప ఎన్నిక ప్రశాంతగా జరగాలన్నారు. అందుకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు గ్రామాల వారీగా పరిస్థితులు సమీక్షిస్తూ ఉండాలన్నారు. ఆదివారం నుంచి పత్తిపాడు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు గుంటూరు నగరంతో పాటు పత్తిపాడు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. సమావేశంలో అర్బన్‌ ఎస్పీ కోటేశ్వర రావు, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.