అవినీతి అంతానికి సురాజ్య ఉద్యమం: జేపీ

హైదరాబాద్‌: అధికార యంత్రాంగం పనిచేయకపోవడం వల్లే వారంలోనే ఉత్తరాంధ్రలో రెండు ప్రమాదాలు జరిగాయని లోక్‌సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించారు. పారిశ్రామిక ప్రమదాల నివారణకోసం కమిటీ వేసి అధ్యయనం చేయాలని డిమాండ్‌ చేశారు. అసంబద్ధ విధానాలు, మూర్ఖుపు పథకాల వల్లే భయంకరమైన విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే రికార్డు స్థాయిలో విద్యుత్తు రంగం అప్పుల్లో కూరుకుపోతుందని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఇక ముందు జాతీయ, రాష్ట్రస్థాయిలో వామపక్షాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అవినీతి అంతానికి ఆగష్టు నుంచి సురాజ్య ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు జయ ప్రకాశ్‌ వెెల్లడించారు.