అసెంబ్లీ తీరు చూస్తే బాధగా ఉంది: చంద్రబాబు

హైదరాబాద్‌: అసెంబ్లీ తీరు చూస్తే బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం  చేశారు. నాయకుల తీరుతో ప్రజలకు అసెంబ్లీపై నమ్మకం పోయిందన్నారు. చర్చలు జరిగితే ఇబ్బందిపడతామని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నడపడం స్పీకర్‌ బాధ్యతని.. ఆయనకు సహకరించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. డబ్బులు చెట్టకు కాయడం లేదన్న ప్రధాని వ్యాఖ్యాలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు దోచుకున్న వైనం ప్రధానికి కనిపించడం  లేదా అన్ని ప్రశ్నించారు.