అసోంలో పోటెత్తిన వరదలు

గౌహతి: అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 13 జిల్లాలపై వరద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆయా జిల్లాల్లో సుమారు 4 లక్షల మందికిపైగా నిరాశ్రయులుగా మిగిలారు. వుధిమరి నది ఉద్థృతికి రాంగియా సబ్‌ డివిజన్‌  ప్రాంతంలోని బోయిరా గ్రామంతో పాటు పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రభుత్వం పునరావస శిబిరాలను ఏర్పాటు చేసి బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.