అసోంలో బాంబు పేలుడు.. ఒకరి మృతి
గౌహతి: అసోం రాష్ట్రంలోని సిబ్సానగర్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. సెంట్రల్ మార్కెట్ ఏరియాలో నిన్న రాత్రి సైకిల్‌పై అమర్చిన ఓ బాంబు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను సిబ్సానగన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.