అస్తమించిన భారతరత్నం

hym-slidepic1a

మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్ర్తవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (84) కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని ఐఐఎంలో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలారు. వెంటనే ఆయన్ని నాన్ గ్రిమ్ హిల్స్ లోని బేథనీ హాస్పిటల్ కు తరలించారు. ఐసీయులో వైద్యులు చికిత్స చేస్తుండగానే కలాం తుదిశ్వాస విడిచారు.
2002 నుంచి 2007 వరకు కలాం భారత 11వ రాష్ర్టపతిగా పనిచేశారు. 1997 లో దేశ త్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ అందుకున్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931న నిరుపేద ముస్లిం కుటుంబంలో కలాం జన్మించారు. కష్టపడి చదివి, చదవడానికి కష్టపడి దేశం గర్వించదగ్గ శాస్ర్తవేత్తగా, భారత మొదటి పౌరుడిగా ఎదిగారు. కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో పోఖ్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించడంలో కలాం కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రక్షణరంగ సంస్థ డీఆర్డీఓ, అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలోనూ ఆయన అనేక పరిశోధనల్లో ప్రధాన భూమిక వహించారు.