అస్సాంలో పర్యటించనున్న ప్రధాని

ఢిలీ: అస్సాంలో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శనివారం పర్యటించనున్నారు. గత ఐదురోజులుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో చెలరేగిన హింసాకాండ ఫలితంగా నలభై మందికి పైగా మృతి చెందారు. రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సైన్యం అక్కడ ఈ రోజు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తోంది.