అస్సాం వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్‌: పొట్ట చేతపట్టుకొని అస్సాం నుంచి వచ్చిన పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని విశ్వహిందు పరిషత్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు అస్సాంలో హిందువులపై దాడులకు నిరసనగా  నగరంలో విశ్వహిందు పరిషత్‌ భారీ ర్యాలీ నిర్వహించి, ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. అస్సాంలో హిందువులపై దాడులు చేయటం అమానుషమని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మత ఛాందసవాదుల ఆగడాలను ఆరికట్టడంలో విఫలమైందని విమర్శించారు.