ఆంధ్రప్రదేశ్‌ విభజన ఖాయం: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన ఖాయమని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ అయన జంతర్‌మంతర్‌ వద్ద బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ పోరు దీక్ష శిభిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. శిభిరంలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఇవ్వడానికి సమయం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తెలంగాణను ఇస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆవేదనతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోరి రావడం ఖాయమని, తాము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.