ఆజాద్‌తో ముఖ్యమంత్రి సమావేశం
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. దేశ రాజధాని నుంచి నగరానికి చేరుకున్న ఆజాద్ అక్కడినుంచి హైటెక్స్‌కు వెళ్లారు. రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.