ఆజాద్‌ను కలిసిన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ను ఇవాళ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలుసుకున్నారు. ఆజాద్‌ లేక్‌వ్యూ అతిధి గృహంలో విడిది చేయగా ఆయనను మంత్రి లుసుకున్నారు. రాజీనామా తదనంతరం పరిణామాలపై ఆజాద్‌కు  మంత్రి వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. ధర్మాన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆజాద్‌ను కలుసుకోవడం ఇదే మెదటిసారి.