ఆజాద్‌ వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ జేఏసీ

హైదరాబాద్‌: తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోలేమని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యాలను తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ప్రజల ఆకాంక్షను, ప్రజాస్వామ్యాల్ని అపహాస్యం చేసేలా ఆజాద్‌ వ్యాఖ్యానించారని జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆజాద్‌ వ్యాఖ్యాలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. గుప్పెడు మంది సీమాంథ్ర పెట్టుబడుదారుల చేతుల్లో ప్రభుత్వం బందీ అయ్యిందని ఆయన విమర్శించారు. ఆజాద్‌ వ్యాఖ్యాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తెగించి ఐక్యంగా పోరాడి తెలంగాణ సాధించుకోవాలని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు.