ఆటో బోల్తా: 8 మంది విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌: మలక్‌పేటలోని టీవీ టవర్‌ వద్ద ఓ పాఠశాల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.