ఆటో సమ్మె వాయిదా

హైదరాబాద్‌: ఈనెల 6న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తల పెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆటో సంఘాల నేతలు ప్రకటించారు. ఆటోల కనీస రుసుము పెంచాలన్న ఆటో సంఘాల డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇవాళ ఆటో సంఘాల నేతలతో ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ చర్చలు జరిపారు. పెట్రోల్‌ ధరలు పెరిగిన దృష్ట్యా ఆటో చార్జీలు పెచుతామని ఆటో కార్మికులకు హామీ ఇచ్చారు. ఆటో చార్జి ఎంత పెచాలన్న విషయంపై ఈనెల 25న రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో జరిగే చర్చల్లో తుదినిర్ణయం తీసుకోనున్నట్లు రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు.