ఆడపడచులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

share on facebook

హైదరాబాద్‌,అక్టోబర్‌13  (జనం సాక్షి)  : ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.
’పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి
సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ అని ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇదిలావుంటే మహబూగర్‌ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మినీ ట్యాంక్‌బండ్‌పై మెగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. ప్రజలకు కనువిందు చేసేలా ట్యాంక్‌బండ్‌లో హంస వాహనం ఏర్పాటు చేశారు. దీంతోపాటు బాణాసంచా, లేజర్‌ షో నిర్వహించారు. బతుకమ్మ సంబురాలను చూసేందుకు జిల్లా కేంద్రంతో పాటు, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తరలిరానున్నారు.

Other News

Comments are closed.