ఆడబిడ్డలకు ఆపన్న హస్తం కళ్యాణ లక్ష్మి.
– డా.రసమయి బాలకిషన్.
బెజ్జంకి,సెప్టెంబర్3,(జనం సాక్షి):మండల కేంద్రంలోని రేవులపల్లి,కల్లేపల్లి,గూడెం,బె జ్జంకి,వడ్లూరు గ్రామాలలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తానే స్వయంగా ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం రసమయి మాట్లాడుతూ 2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసే వారని,టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం పేరుతో ఆడబిడ్డలకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ మేనమామగా మారి 1లక్ష 116 రూపాయలు ప్రతి ఇంటికి అందిస్తున్నారని అన్నారు.గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు భరోసా ఇవ్వలేదని ఇప్పుడు ప్రతి ఇల్లు కేసీఆర్ ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని తమ భరోసా అనుకుంటున్నారని రసమయి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్,మండల కో ఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి,ఏఎంసి కచ్చు రాజయ్య,సర్పంచ్లు జెల్ల అయిలయ్య,నలువాల అనితస్వామి,చింతల పల్లి సంజీవ రెడ్డి,దారం లక్ష్మి తిరుపతి రెడ్డి,పెండ్యాల బాపూ రెడ్డి,వైస్ ఎంపీపీ చెలుకల సభితా తిరుపతి రెడ్డి,ఎంపీటీసీ దుంబాల రాజా మహేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీందర్ రెడ్డి,తెరాస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,తెరాస నాయకులు ఏఎంసి వైస్ చైర్మన్ హన్మండ్ల లక్ష్మారెడ్డి,ద్యావ శ్రీనివాస్ రెడ్డి,పోతిరెడ్డి స్రవంతి మధుసుధన్ రెడ్డి,అయిల పాపయ్య,ముక్కిసా రాజి రెడ్డి,తెరాస సోషల్ మీడియా ఇంఛార్జి ఎల శేఖర్ బాబు,మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,ఏఎంసి డైరక్టర్ దీటి రాజు,నాయకులు జంగిటి శ్రీనివాస్ రెడ్డి,తాల్ల స్వామి,మేకల శ్రీకాంత్,కోరివి తిరుపతి, ముత్యాల వెంకట్ రెడ్డి, బిగుల్ల సుదర్శన్,బిగుల్ల మోహన్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.