ఆదిలాబాద్‌ జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు నారా చంబ్రాబునాయుడు ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆదిలాబాద్‌ జిల్లా బీసీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలో బీసీల పరిస్థితులపై అడిగితెలుసుకున్నారు. తెదేపా ఈసారి ఎన్నికల్లో మూడో వంతు సీట్లను బీసీలకు కేటాయించడం ద్వారా వారు రాజకీయంగా మరింత ఎదిగేందుకు అండగా ఉంటుందని వారికి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలకు సరైన అవకాశాలిస్తే మరింతగా రాణిస్తారన్నదే తెదేపా అభిప్రాయమన్నారు.