ఆదివాసి చట్టాలను అమలు పరచని ఇంఛార్జి ఎంపిఓ

.

 

 

 

 

 

 

 

అక్రమ నిర్మాణాల గురించి కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్తాము.
-ఆదివాసి చట్టాలను అపహాస్యం చేస్తున్న అధికారులు.

పినపాక,మార్చి14(జనంసాక్షి):-

పినపాక మండలం, ఏడూళ్ళ
బయ్యారం గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి గృహ నిర్మాణాలను పంచాయతీ కార్యదర్శి గాలికి వదిలేశారని అనడానికి ఇది ఒక నిదర్శనం. 21-01-23న నూతనంగా గృహ నిర్మాణం చేపట్టిన సూరెడ్డి తిరుపతిరెడ్డి సన్నాఫ్ వెంకటసుబ్బారెడ్డి కి బయ్యారం గ్రామపంచాయతీ కార్యదర్శి జైపాల్ రెడ్డి 21-01-2023 న ఇది ఏజెన్సీ ప్రాంతం, షెడ్యూల్ ఏరియా, 1/70 యాక్ట్ అమల్లో ఉన్నందున పంచాయతీ లో పేసా గ్రామ సభ అనుమతులు లేకుండా గృహ నిర్మాణాలు చేపట్ట రాదని ,లేనియెడల 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చినారు. ఇచ్చిన నాటినుండి వారం రోజుల వరకు ఇంటి నిర్మాణ పనులను నిలుపుదల చేసి మళ్లీ మొదలు పెట్టినారు. ఇట్టి విషయాన్ని ఆదివాసి సేన మండల కమిటీ ఎడుల్ల బయ్యారం పంచాయతీ కార్యదర్శి జైపాల్ రెడ్డిని వివరణ అడగగా తాను ఆదివాసి సేన మండల అధ్యక్షులకు ఒక ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా ఒక దళారిలాగా మారి తాను ఆదివాసి సేన మండల అద్యక్షులకి లంచం ఇవ్వచూపినారు.చట్టాలను కాపాడాల్సిన వారే దళారీ లాగా మారి అక్రమ గృహ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రశ్నించిన వారికి డబ్బులు ఇచ్చి గృహ నిర్మాణాలు చేయుటకు సహకరిస్తున్నారు. ఇలా గతంలో ఎంతమందికి సహకరించారో అనడానికి బయ్యారం క్రాస్ రోడ్ లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తులు నిలువెత్తు నిదర్శనం.కంచె చేను మేసిన తీరుగా చట్టాలను కాపాడాల్సిన అధికారులే ప్రశ్నించిన వారికి డబ్బులు ఎరవేసి ఆదివాసి చట్టాలను నాశనం చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి మీరు ఇచ్చిన నోటీసులు ఏమిటి? అని, ఆ నోటీసులను మాకు ఇవ్వగలరని అడగగా మీకు ఏమి ఇవ్వము అని అన్నారు. దానికి మేము సమాచారం కొరకు దరఖాస్తు పెట్టుకున్నాము .ఆ దరఖాస్తు కు సమాధానం ఇచ్చినారు. కానీ ఈరోజు దరఖాస్తులు ఏమైతే సమాధానం ఇచ్చినారో ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ వేస్తున్నారు. దానికి ఏడుళ్ళ బయ్యారం గ్రామపంచాయతీ కార్యదర్శి అయిన జైపాల్ రెడ్డికి చరవాణిలో వివరణ అడగగా దానికి ఎటువంటి స్పందన లేకపోగా, నేను ఏమి చేయలేను .మీరు ఏది చేయాలనుకుంటే అది చేసుకోండి అని అన్నారు.
అసలు ఈ అధికారులు ఆదివాసి చట్టాలను కాపాడడానికా? లేకపోతే గిరినేతరులతో కలిసి ఆదివాసి చట్టాలను నాశనం చేయడంలో సహకరించడానికా? ఆదివాసి చట్టాలపై గౌరవం లేని ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని , ఈ పైన జరిగిన అక్రమాలను, సహకరించిన అధికారులను అందరిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసి చట్టాలను నిర్వీర్యం కాకుండా కాపాడాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తుందని
ఆదివాసి సేన మండల అధ్యక్షుడు వినయ్ కుమార్ మండిపడ్డారు.

ఆదివాసి ప్రజానీకానికి పొంచి ఉన్న ప్రమాదం.

ఇదే సాంప్రదాయం వలన ఎక్కువైతే ఏజెన్సీ ప్రాంతంలో జనాభా శాతం ఎక్కువయ్యి రాబోవు కాలంలో గిరిజనేతరులు జీవో నెంబర్ 3 ని ఏ విధంగా రద్దు చేసినారో, అదే విధంగా గిరిజనేతరులు అధికంగా ఉన్నమని గిరిజన చట్టాలకు కూడ విగాథం కల్గ చేయవచ్చును. దాని ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్న సర్పంచులు, ఉప సర్పంచ్లు , వార్డు నెంబర్లు ,ఎంపీటీసీలు పదవులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కొన్ని కొన్ని గ్రామపంచాయతీలో జనరల్ వార్డ్ మెంబర్లు , జనరల్ ఎంపీటీసీలు ,జడ్పీటీసీలు వలస గిరిజనేతరుల వలన ఏర్పడినాయి. ఈ జనరల్ లో ఏ ఒక్క గిరిజనులు కూడా పోటీ చేయలేదు. ఎందుకు?. కాబట్టి ఇకనైనా ఆదివాసి ప్రజాప్రతినిధులారా ఆలోచించి మాన చట్టాలను, రిజర్వేషన్లను ఈ గిరిజనేతరుల నుండి కాపాడడానికి, వలస గిరిజనేతరులను రాకను నివారించడంలో సంసిద్ధులు కావాలి అని అన్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 3 ని ,జనరల్ పదవులను ఎలా కోల్పోయాము ?ఇప్పుడు ఆదివాసి చట్టాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆదివాసి మండల అధ్యక్షులు వినయ్ కుమార్ అన్నారు..