ఆదోనిలో భారీ వర్షంతో ఆటో డ్రైవర్‌ గల్లంతు

కర్నూలు: ఆదోని పట్టణంలో ఈరోజు భారీ వర్షం కురిసింది. శివశంకర్‌నగర్‌ సమీపంలో ఉన్న మండిగిరివంకలో పడి ఇస్మాయిల్‌ అనే ఆటో డ్రైవర్‌ ఆటో సహా గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఇస్మాయిల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోపక్క పట్టణంలోని బోయగెరి, వడ్డెగెరి, చెరువుగెరి, కౌడల్‌పేటలలో అనేక ఇళ్లు నీటమునిగాయి. 50 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.