ఆప్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు
న్యూఢిల్లీ జనంసాక్షి : హస్తినలో ఆప్ విజయభేరీ మోగించింది. ఇక రెండు రోజుల్లో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతలోనే ఆప్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. విరాళాల వివాదంలో ఆప్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రూ. 2 కోట్ల విరాళాలపై ఐటీ శాఖ వివరణ కోరింది. ఈ నెల 16 లోగా విరాళాల వివాదంపై వివరాలు తెలపాలని ఆప్‌కు ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది.