ఆప్ వాలంటీర్స్‌ను మెచ్చుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ : నిన్న హస్తిన అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కే ఆధిక్యం వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆప్ వాలంటీర్స్‌ను ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ట్విట్ చేశారు. హస్తిన ఎన్నికల్లో మీరు మంచి ఉద్యోగం చేశారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోండి. హాయిగా కుటుంబ సభ్యులతో గడపండి. సినిమాలు చూడండి. ధ్యానం చేయండి. మిమ్మల్ని దేవుడు అనుగ్రహించాలని ట్విట్ చేశారు.