ఆయనను బేషరతుగా విడుదల చేయాలి

కడప, ఆగస్టు 3 : రైతాంగ సమస్యలపై పోరాటం చేసే నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు రమేష్‌నాయుడు ప్రశ్నించారు. రైతాంగం సమస్యలపై ఖాజీపేట మండలం దుంపలగట్టు వద్ద పార్టీ నాయకులు వెంటక సుబ్బారెడ్డి నిరసన వ్యక్తం చేశారని అన్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండు చేశారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు, ప్రజల సమస్యల పట్ల టీడీపీ మున్నుందు పోరాడుతుందని అన్నారు.