ఆరుగురు ఇంజినీరింగు విద్యార్థుల గల్లంతు

రుషికొండ: విశాఖపట్నం లోని రుషికొండ సమీపంలోని గీతం ఇంజినీరింగు కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం సమయంలో బీచ్‌లో ఈతకు వెళ్లారు. వీరిలో ఒకరు ఒడ్డుకు చేరుకోగా మిగతా ఆరుగురి ఆచూకీ తెలియ రాలేదు. గల్లంతైన వారిలో ముగ్గురు అమ్యాయిలు ఉన్నట్టు సమాచారం.