ఆరోగ్యశ్రీపై సీఎం కిరణ్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి కొండ్రు మురళితోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వోద్యోగులను నవంబర్‌ నెలాఖరులోగా హెల్త్‌కార్డులు అందజేస్తామని వాటిపై 60 శాతం ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కొండ్రు తెలియజేశారు. కాగా ఈ కార్డులపై ఫోటోను కూడా పెట్టనున్నట్టు సీఎం తెలిపారు. 19 లక్షల మంది పింక్‌ కార్డు హోల్డర్లకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.