ఆర్టిసీ సమస్యలు పరిష్కరించకుంటే 14 నుంచి బస్సుల నిలిపివేత:ఎన్‌ఎంయు

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించనని పక్షంలో ఈనెల 14 నుంచి బస్సులు నిలిపి వేయటం ఖాయమని ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్పష్టం చేసింది.డిమాండ్ల పరిష్కారం కోసం 3వేల మంది కార్మికులతో బస్‌ భవన్‌ ముందు ధర్నా చేశారు.22వేల మంది కాంట్రాక్టు డ్రైవర్లు కండక్టర్లు సర్వీసుల క్రమబద్దీకరణ సహ 36 డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిరా కనీస స్పందన లేక పొవటం దారుణమని కార్మికసంఘం నేతలు అన్నారు.ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యల పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు.