ఆర్టీఏ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్‌

హైదరాబాద్‌:నగరంలో నాగోల్‌లో ఉన్న ఆర్టీఏ కార్యాలయాన్ని ఆర్టీఏ కొత్త కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.ట్రాక్‌ల పనితీరు,వాటి స్థితిగతులను,కార్యాలయ సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.ప్రజలకు మెరుగైన సేవటు అందించడానికి కృషిచేస్తామని ఆయన చెప్పారు.నాగోల్‌లోని కార్యాలయం చిన్నగా ఉందని గుడిమల్యాపూర్‌లోని ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నామని అనుకూలంగా ఉంటే అక్కడికి మార్చతామని కమిషనర్‌ తెలిపారు.