ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాల్సిందే:హైకోర్టు

హైదరాబాద్:ఇరు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పై హైకోర్టులో జరుగుతున్న విచారణ మధ్యాహ్నం 12.30 గంటలకి వాయిదా వేసింది. మరో వైపు సమ్మె విరమిస్తారో లేదో చెప్పేందుకు యూనియన్లకు కోర్టు సమయం ఇచ్చింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె విరమించకుంటే ఏం చేయాలో ప్రభుత్వాలకు ఆదేశిస్తాం అని హైకోర్టు హెచ్చరించింది.