ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో వృద్దులకు రాయితీ ఇవ్వాలి: మందకృష్ణ

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో వృద్దులకు రాయితీ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ ఆధ్యర్యంలో సీనియర్‌ సటిజన్‌ సంఘం ప్రతినిధులు రవాణాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి సిజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడంపై 2004లోనే కార్యచరణ పథకాన్ని ఆమోదించినప్పటికీ నేటికీ అమలు కావడంలేదని మందకృష్ణ తెలిపారు. అక్టోబరు 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం నాటికి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరినట్లు మందకృష్ణ తెలిపారు.