ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవి పొడిగింపు
ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢల్లీి,అక్టోబర్29 (జనంసాక్షి): ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయనను ఈ పదవికి పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన 2024 డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు. శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా 2018 డిసెంబర్ 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2021 డిసెంబర్లో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. శక్తికాంత్‌దాస్ పదవీకాలం ముగియడానికి నెలన్నర రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఒడిషాకు చెందిన శక్తికాంతదాస్ 1980వ బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తమిళనాడు కేడర్‌ను ఎంచుకున్న ఆయన ఆ రాష్ట్రంలో వివిధ పదవులు చేపట్టారు. ఐఏఎస్ అధికారిగా రిటైరయిన తర్వాత 15వ ఎª`లానింగ్ కమిషన్ సభ్యుడిగా కొనసాగారు. జీ 20 కూటమిలో ఇండియా తరఫున కీలక భూమిక నిర్వహించారు.